“రిపబ్లిక్” సినిమాపై నారా లోకేష్ కామెంట్స్!

Published on Oct 3, 2021 3:02 pm IST


మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలెంటడ్ నటి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “రిపబ్లిక్”. విలక్షణ దర్శకుడు దేవా కట్ట అద్భుతమైన సామజిక అంశాలతో తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. అయితే బాక్సాఫీస్ పరంగా పక్కన పెడితే సినిమాకి అప్లాజ్ మాత్రం సాలిడ్ గా వస్తుంది. మరి ఈ లిస్ట్ లో ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా చేరాడు.

ఈ సినిమాపై తాను తాజాగా చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. “రిపబ్లిక్ సినిమా కోసం గ్రేట్ రివ్యూస్ వింటున్నాని, దర్శకుడు దేవా కట్ట, సాయి ధరమ్ తేజ్ ల అద్భుతమైన వర్క్ ని నేను కూడా వీలు చూసుకొని చూస్తాను. సాయి ధరమ్ తేజ్ త్వరగా తిరిగి కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. దీనిని బట్టి రిపబ్లిక్ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :