మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ అంచనాల నడుమ వచ్చిన ‘సైరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి సినీ ప్రముఖులంతా ‘సైరా’ అద్భుతమైన సినిమా.. హృదయాన్ని కరిగించిన సినిమా.. గొప్ప దేశభక్తిని చాటిన సినిమా అని విశేషంగా పొగుడుతున్నారు. కాగా తాజాగా సైరా పై నారా లోకేష్ ట్వీట్ చేశారు. “తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా ‘సైరా’. ఇది చిరంజీవిగారి 12 ఏళ్ళ కల. ఆయన తన కలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్! చిరంజీవిగారు. అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్‌చరణ్, దర్శకులు సురేంద్ర, చిత్ర యూనిట్‌కి నారా లోకేష్ అభినందనలు తెలిపారు.
కాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘సైరా’ సక్సెస్ ను మెగా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తోంది. కాగా నేడు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తో కలిసి సైరా విజయవంతమైనందుకు విందు ఏర్పాటు చేశారు. మెగా ఫ్యామిలీ తో పాటు పరిశ్రమలోని ప్రముఖ నటులు, దర్శకులను ఈ పార్టీకి ఆహ్వానించడం జరిగింది.
