బాలయ్యకి నారా లోకేష్ వెరీ స్పెషల్ బర్త్ డే విషెష్.!

Published on Jun 10, 2022 10:00 pm IST

ఈరోజు మన టాలీవుడ్ దిగ్గజ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో మరియు బయట కూడా అభిమానులు బాలయ్యకి ఘనంగా బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. అలాగే బాలయ్య సినిమాల నుంచి కూడా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ పోస్టర్స్ వచ్చాయి.

ఇక ఇదిలా ఉండగా పలువురు సినీ ప్రముఖులు బాలయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుండగా బాలయ్య అల్లుడు తెలుగు దేశం పార్థి అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, పార్టీ యువ నేత నారా లోకేష్ వెరీ స్పెషల్ విషెష్ ని తెలియజేయడం అభిమానుల్లో ఆసక్తిగా మారింది.

ముక్కు సూటితనం, నిజాయితీ, బంగారు హృదయం ఇలా ఎన్నో గొప్ప గుణాలు కలయిక అయిన మా బాల మావయ్యకి హృదయ పూర్వక జన్మదిన సుభాకాంక్షలు తెలియజేస్తున్నానని లోకేష్ బాలయ్య నెక్స్ట్ మూవీ మాస్ పోస్టర్ తో తెలియజేయగా ఈ పోస్ట్ తో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :