ఊర మాస్ లుక్ తో ఆకట్టుకుంటున్న నారా రోహిత్ !

14th, February 2017 - 09:38:14 AM


హీరో నారా రోహిత్ నూతన చిత్రం ‘కథలో రాజకుమారి’ ఫస్ట్ లుక్ వాలెంటైన్స్ డే సందర్బంగా విడుదలైంది. టైటిల్ చూస్తే చాలా సాఫ్ట్ గా ఉన్నా ఫస్ట్ లుక్ లో నారా రోహిత్ మాత్రం చాలా వైలెంట్ గా కనిపిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పక్కా పల్లెటూరి నాటు వ్యక్తిలా ఉన్నాడు. ఇప్పుడు ఆ లుక్కే అందరి దృష్టినీ ఆకృషిస్తోంది. సహజంగా ఇలాంటి మేకోవర్ తమిళ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

అక్కడి హీరోలు ఇలాంటి పాత్రలు చేయడానికి అస్సలు వెనుకాడరు. ‘కార్తి, ధనుష్’ లాంటి వాళ్లంతా అలాంటి సినిమాలు చేసే స్టార్లవుగా ఎదిగారు. కానీ మన హీరోలు మాత్రం అలాంటి రఫ్ క్యారెక్టర్స్ చేయడానికి చాలా వరకు ఇష్టపడరు. ప్రేక్షకుల్లో కూడా ఈ నమ్మకమే ఉంది. అలాంటిది ఒక్కసారిగా రోహిత్ లుక్ ను చూసే సరికి చాలా మంది ఆశ్చర్యానికి లోనై ఎట్టకేలకు తమిళుల సక్సెస్ ఫార్ములాను తెలుగు హీరోలు ట్రై చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే మహేష్ సూరపనేని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నమిత ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తోంది.