నారా రోహిత్ మల్టి స్టారర్ షూటింగ్ మొదలు !

పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆటగాళ్ళు’. గేమ్‌ విత్‌ లైఫ్‌ అనేది ట్యాగ్ లైన్. నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

ఆటగాళ్ళు సినిమా షూటింగ్ రోజు హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ఈ సినిమా కథ ఎంత ఆసక్తికరంగా సాగుతుందో, వినోదం కూడా అదేవిధంగా ఉండబోతోందని తెలుస్తోంది. పెదబాబు, ఆంధ్రుడు, అధినాయకుడు సినిమల తరువాత పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇదే అవ్వడం విశేషం. కొత్త కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విజయం సాదిస్తుందని ఆశిద్దాం.