
యంగ్ హీరో నారా రోహిత్ మరోసారిడిఫరెంట్ క్యారెక్టర్ తో, పూర్తి విభిన్న కథాంశంతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘అసుర’.నిన్ననే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ వారు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా సెన్సార్ బోర్డ్ వారు ఈ సినిమాకి చాలా పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమాని మే 29న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు. కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ ని ఒకవారం వాయిదా వేసారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని జూన్ 5న రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ అయినట్లు ఈ చిత్ర టీం తెలియజేసింది. మే 29న మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అవుతుండడం వలన అన్ని సినిమాలకు ఎక్కువ థియేటర్స్ దొరకవు కాబట్టి అసుర టీం ఆ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వీరు జూన్ 5కి వెళ్ళారు. 122 నిమిషాల నిడివితో రానున్న ఈ థ్రిల్లర్ సినిమాలో వచ్చే సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని కచ్చితంగా థ్రిల్ చేస్తాయని ఈ చిత్ర టీం అంటున్నారు. కృష్ణ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా బెనర్జీ హీరోయిన్. జేమ్స్ మధు, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాని నారా రోహిత్ సమర్పణలో శ్యామ్ దేవభక్తుని ఈ సినిమాను నిర్మించారు.