సెప్టెంబర్‌లో నారా రోహిత్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’..!

nara-rohit-m
హీరో నారా రోహిత్ కొద్దికాలంగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా, సరైన హిట్ మాత్రం దక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే రియలిస్టిక్ సినిమా తన కెరీర్‌కు కచ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుందని నారా రోహిత్ ఆశిస్తూ వస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా అందిన సమాచారం మేరకు ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.

హైద్రాబాద్‌లోని పాతబస్తీ నేపథ్యంలో జరిగే ఈ కథలో నారా రోహిత్ ఓ ముస్లిం యువకుడిగా కనిపించనున్నారు. ‘అయ్యారే’ సినిమాతో మెప్పించిన దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నారా రోహిత్ ఇంతకుముందెన్నడూ కనిపించనంత కొత్తగా కనిపించనున్నారు. ఇక ఓ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మిస్తున్నారు.