డైరెక్టర్ గా కనిపించబోతున్న హీరో !

2nd, January 2018 - 06:40:49 PM

జగపతిబాబు ఈ మధ్య మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తాజాగా నారా రోహిత్ సినిమాలో హీరోకు సమానమైన పాత్రలో జగపతిబాబు కనిపించబోతుండడం విశేషం. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ‘ఆటగాళ్లు’ సినిమాలో ఇద్దరు నటిస్తున్నారు.

తాజా సమాచారం మేరకు నారా రోహిత్ ఈ మూవీ లో సినీ దర్శకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతోన్న ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఫ్రెండ్స్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.