స్వర్గంలో బంగార్రాజు… ‘లడ్డుందా ?’

Published on Nov 7, 2021 7:10 pm IST

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ పై మంచి అంచనాలు ఉన్నాయి. చైతు – నాగ్ కలయికలో రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. నవంబర్ 9న ఉదయం 9:09 నిమిషాలకు ఈ చిత్రం నుంచి మొదటి పాట రాబోతుంది. ‘లడ్డుందా ?’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నారు.

ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్‌ ను కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో బంగార్రాజు స్వర్గంలో ఉండటం, పైగా ఎవరో ఒక దేవ కన్యతో సరసాలు ఆడుతున్నట్టు కనిపించడంతో మొత్తానికి ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. ఇక ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ.. మొత్తానికి స్టార్ట్ అయి స్పీడ్ గా షూట్ ను జరుపుకుంటుంది.

కాగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., జీ స్టూడియోస్ బ్యానర్ల పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్‌ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More