మా ఎలక్షన్: మంచు విష్ణుకు నరేశ్ మద్ధతు..!

Published on Sep 23, 2021 11:24 pm IST


మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అక్టోబరు 10న జరగనున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ సారి మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహా రావులు ఉన్నారు. ఇప్పటికే ప్రకాశ్‌ రాజ్‌ తన ప్యానెల్‌ సభ్యులను ప్రకటించగా, తాజాగా నేడు మంచు విష్ణు కూడా ‘మా కోసం మనమందరం’ పేరుతో తన ప్యానెల్‌ సభ్యులను ప్రకటించాడు. వైస్ ప్రెసిడెంట్స్‌గా మాదల రవి, పృథ్వీరాజ్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్, ట్రెజరర్‌గా శివ బాలాజీ, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కల్యాణి, గౌతమ్‌ రాజులు ఉండనున్నట్టు తెలిపారు.

అయితే తాజాగా ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేష్‌ మంచు విష్ణు ప్యానల్‌కు మద్దతు ప్రకటించారు. విష్ణు ప్యానల్‌లో విష్ణు తన ప్యానల్‌లో స్థానికులకే పెద్దపీట వేశారని, వివాదాస్పద వ్యక్తులెవరూ లేరని, ఆయన ప్యానెల్‌ కొత్తగా ఉందని, అందరూ చదువుకున్నవాళ్లేనని, ప్యానల్‌లో 10 మంది మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందని నరేశ్ అన్నారు.

సంబంధిత సమాచారం :