తన కెరీర్ లోనే బెస్ట్ రోల్ ని బయటపెట్టిన నాజర్

Nassar
విలక్షణ నటుడు నాజర్ తన నటనతో దక్షిణాదిన ప్రేక్షకాధారణ పొందుతున్నాడు . సరికొత్త పాత్రలను పోషించడంలో, వాటిని ప్రేక్షకుల కంటికి ఇంపుగా నిలపడంలో ఎప్పటికప్పుడు విజయం సాధిస్తూనే వున్నాడు. తెలుగు, తమిళ భాషలలో ఎన్నో పెద్ద పెద్ద సినిమాలలో ముఖ్యపాత్రలు పోషించి వాటి విజయానికి తనవంతు కృషి చేసాడు.

తాజాగా కమల్ హాసన్ నటించిన ఉత్తమ విలన్ సినిమాలో ఒక పాత్ర పోషించినట్టు, అది తన కెరీర్ లోనే బెస్ట్ రోల్ అవ్వనున్నట్లు నాజర్ తెలిపాడు. తుది నుండి చివరివరకూ చాలెంజింగ్ గా మరియు ఎంటర్టైనింగ్ గా సాగుతుందని సెలవిచ్చాడు.

ఈ ఉత్తమ విలన్ చిత్రం వచ్చేనెల 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. కమల్ సూపర్ స్టార్ గా మరియు తెయ్యం కళాకారుడిగా ద్విపాత్రాభినయం చేసాడు.

Exit mobile version