బిగ్‌బాస్ 5: విన్నర్ ఎవరో చెప్పేసిన నటరాజ్ మాస్టర్..!

Published on Oct 7, 2021 8:09 pm IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 అప్పుడే ఐదో వారంలోకి ఎంటర్ అయ్యింది. అయితే ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో 15 మంది సభ్యులు ఉన్నారు. అయితే మొన్న వారం ఎలిమినేట్ అయిన నట్‌రాజ్ మాస్టర్ తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సారి టైటిల్ విన్నర్ ఎవరో చెప్పేశాడు.

అయితే నేను నాలా ఉంటే జనాలు ఎంకరేజ్ చేస్తారని అనుకున్నానని, కానీ దొంగ నాటకాలు ఆడే వారినే సపోర్ట్ చేశారని అన్నాడు. గతంలో నాకు పలుమార్లు బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చిందని, ఈసారి అన్నీ కుదిరి హౌస్‌లోకి వెళ్లానని చెప్పాడు. తాను ఈ సీజన్ ద్వారా మూడు లక్షలకు పైగా పారితోషికం పొందినట్టు చెప్పుకొచ్చాడు. ఈ సారి శ్రీరామ్‌, మానస్‌లలో ఎవరో ఒకరు బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచే అవకాశం ఉందని అన్నాడు. ఇకపోతే ఈ వారం హౌస్‌లో నుంచి విశ్వ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.

సంబంధిత సమాచారం :