యువ హీరో నిఖిల్ ప్రస్తుతం ముద్ర అనే రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఇదే టైటిల్ తో నట్టి కుమార్ నిర్మాణంలో జగపతి బాబు నటించిన చిత్రం కూడా విడుదలకావాల్సి వుంది. నిఖిల్ ముద్ర టైటిల్ లోగో అలాగే బుకింగ్ యాప్స్ లో నిఖిల్ పేరు చేర్చడంతో చాలా మంది నిఖిల్ నటించిన ముద్ర అనుకుని టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే ఈ విషయం ఫై నిఖిల్ ఘాటుగానే స్పందించాడు. నా సినిమా ఈ వారం విడుదలకావట్లేదు అని కొంత మంది కావాలనే ఇలా చేశారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
అయితే నిఖిల్ ఫై తాజాగా నిర్మాత నట్టి కుమార్ ఫైర్ అయ్యారు. ముద్ర అనే టైటిల్ నాదే అనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నిఖిల్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు అలాగే టైటిల్ తనదని నిఖిల్ నిరూపించుకోవాలని లేకపోతే సినిమాలనుండి తప్పుకోవాలని అన్నారు.
అసభ్యపదజాలంతో తిడితే ఊరుకుంటారని దీనిపై సోమవారం లోగ నిఖిల్ క్షమాపణ చెప్పాలని లేకపోతే ఈ విషయం చాలా దూరం వెళుతుందని నట్టి కుమార్ హెచ్చరించారు.
