వైరల్ పిక్ : “పుష్ప” నట్టింట ‘నాటు’ సంబరాలు.!

Published on Jan 14, 2023 7:02 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ ఉన్న అవైటెడ్ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో రానున్న చిత్రం పుష్ప 2 కూడా ఒకటి. మరి పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ హిట్ అయినటువంటి రౌద్రం రణం రుధిరం నుంచి ఇటీవలే గేయ రచయిత చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటకి గాను అంతర్జాతీయ అవార్డ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

మరి దర్శకుడు సుకుమార్ ఈ గేయ రచయిత తోనే తన సినిమాల అన్ని పాటలు ఎప్పుడు నుంచో రాయించుకుంటూ వస్తున్నారు. మరి వారి ఆస్థాన రచయిత అయినటువంటి చంద్రబోస్ కి అయితే శుభాకాంక్షలు తెలుపుతూ దర్శకుడు సుకుమార్ సహా పుష్ప యూనిట్ అంతా చంద్రబోస్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనితో చంద్రబోస్ పుష్ప ఇంట నాటు సంబరాలు అంటూ తమ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేయగా ఇది వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :