స్టైలిష్ క్లిక్స్ : లేటెస్ట్ లుక్ లో అదరగొట్టిన నాచురల్ స్టార్ నాని

స్టైలిష్ క్లిక్స్ : లేటెస్ట్ లుక్ లో అదరగొట్టిన నాచురల్ స్టార్ నాని

Published on Dec 14, 2022 3:00 AM IST


టాలీవుడ్ నటుడు నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం కీర్తి సురేష్ తో కలిసి దసరా మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా రూపొందుతోన్న ఈ మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. శ్రీకాంత్ ఓదెల తీస్తున్న దసరా మూవీ వచ్చే ఏడాది మార్చి 30న రిలీజ్ కానుంది.

అయితే ఓవైపు హీరోగా కొనసాగుతున్న నాని, మరోవైపు తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మాతగా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ ఆడియన్స్ నుండి మరింతగా క్రేజ్ తో దూసుకెళ్తున్నారు. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుత 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నేడు ఫుల్ క్రాఫ్, గడ్డంతో తాను దిగిన స్టైలిష్ పిక్స్ ని కొద్దిసేపటి క్రితం నాని తన ఇన్స్టాగ్రమ్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. తమ అభిమాన హీరో అదరగొట్టే లుక్ లో ఉన్న ఆ ఫొటోస్ ని నాని ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తుండగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CmG_O6mPTFL/?igshid=MDJmNzVkMjY%3D

సంబంధిత సమాచారం

తాజా వార్తలు