నాని చేతుల మీదుగా రిలీజ్ కాబోతున్న “భళా తందనాన” టీజర్..!

నాని చేతుల మీదుగా రిలీజ్ కాబోతున్న “భళా తందనాన” టీజర్..!

Published on Jan 27, 2022 11:00 PM IST

యంగ్ హీరో శ్రీ విష్ణు, కేథరిన్‌ హీరో హీరోయిన్లుగా వారాహి చలన చిత్ర పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇటీవల షూటింగ్‌ని కూడా పూర్తి చేసుకుంది.

ఈ నేపధ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించిన చిత్ర బృందం రేపు టీజర్‌ని రిలీజ్ చేయబోతుంది. న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రేపు ఉదయం 10:24 గంటలకు టీజర్‌ని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు