క్లాసికల్ డ్యాన్స్‌తో టచ్ లేని వాళ్లకు కూడా నాట్యం ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది – సంధ్యారాజు

క్లాసికల్ డ్యాన్స్‌తో టచ్ లేని వాళ్లకు కూడా నాట్యం ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది – సంధ్యారాజు

Published on Oct 20, 2021 9:04 PM IST


ప్రముఖ నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. నృత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించారు. నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ సంధ్యారాజు నాట్యం సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకుంది.

చిన్నప్పటి నుంచి నాట్యం అంటే నాకు ప్రాణం. సినిమా ద్వారా ఇంకా దగ్గరకు రావొచ్చనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాను. నాట్య ప్రదర్శనలు చేస్తే ఎప్పుడూ ఒకే సెక్షన్ పీపుల్స్ చూస్తుంటారు. కానీ ఒక్క షార్ట్ ఫిల్మ్ ద్వారానే నాట్యం గురించి ఎంతో మందికి చెప్పామని, అది చాలా రీచ్ అయ్యిందని, సినిమా మాధ్యమానికి ఉన్న శక్తి ఏంటో అర్థమైందని, అందుకే ఈ సినిమాను తీశానని అన్నారు.

నాకు చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచం గురించి తెలీదు. నా ధ్యాస అంతా ఎప్పుడూ కూడా నాట్యం మీదే ఉండేది. నాట్య ప్రధానంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. కే విశ్వనాథ్ వంటి వారు గొప్ప చిత్రాలు చేశారు. నాట్యం అంటే కాళ్లు చేతులు కదపడం కాదు.. దాని ద్వారా ఓ కథను చెప్పడం అనే మా దర్శకుడి ఆలోచన ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ నాట్యం ద్వారా జనాల్లో ఆలోచనలు రేకెత్తించొచ్చు. పాత కాలంలో నాట్యం అనేది కూడా ఓ సినిమాలాంటిదేనని అన్నారు.

నాట్యం చిత్రంలో రెండు మూడు కథలు అంతర్లీనంగా ఉంటాయి. గురు శిష్యుల సంబంధాన్ని చూపిస్తామని, క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దులను చూపిస్తామని వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్‌కు మధ్య ఉన్న తేడా ఏంటి? అని ఇలా రెండు మూడు ట్రాక్‌లు జరుగుతూ ఉంటాయి. నాట్యం అనేది ఊరి పేరు. దాని చుట్టూ ఉండే మూఢ నమ్మకాలు కూడా సినిమాలో ఉంటాయి. కమర్షియల్ సినిమాలానే ఉంటుందని అన్నారు.

మా సినిమాను చిరంజీవి గారు ఇంకా చూడలేదని, సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి కాకుండా వ్యాపార రంగం నుంచి నేను రావడం, ఇలా సినిమా తీయడం, నటించడం ఆయనకు బాగా నచ్చిందని, మా టీజర్‌ని చూసి ఆయన మమ్మల్ని ప్రశంసించారని అన్నారు.

ఈ సినిమాను క్లాసికల్ డ్యాన్స్‌తో టచ్ లేని వాళ్లకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా డిజైన్ చేశామని, దాని కోసం మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని, స్టోరీకి తగ్గట్టుగా కొరియోగ్రఫినీ చేశామని కానీ ఆ పాటతో పాటుగా స్టోరీ కూడా ముందుకు వెళ్తుందని అన్నారు. రోహిత్ పూర్తిగా వెస్ట్రన్ డ్యాన్సర్. అలా అన్ని రకాల డ్యాన్సులు ఇందులో ఉంటాయని అన్నారు.

నిర్మాతగా, నటిగా వ్యవహరించడం చాలా కష్టంగా అనిపించిందని, ప్రొడక్షన్ టీం, లొకేషన్ టీం, అన్ని డిపార్ట్మెంట్‌లతో కలిసి పని చేస్తూ వచ్చానని, అలా హీరోయిన్‌లా ఎక్కడా ఉండలేకపోయాను. సినిమాను పూర్తి చేసి థియేటర్‌కు పట్టుకురావడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పారు.

నాట్యం ప్రధానంగా ఓ షార్ట్ ఫిల్మ్ చేశాం. దానికి చాలా ఆదరణ వచ్చింది. ఎంతో మంది ఫోన్ చేసి అభినందించారు. ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల మా జీవితాలు మారిపోయానని అన్నారు. అలా అప్పుడు మాకు ఈ సినిమా మీద ధైర్యం వచ్చిందని, ఈ సినిమాను జనాలు చూసి ఆదరిస్తే ఇంకా ఇలాంటి సినిమాలు చేసేందుకు మాకు ప్రోత్సాహానిచ్చినట్టు అవుతుందని అన్నారు.

నాట్య ప్రదర్శన ఇవ్వడానికి తెర ముందు నటించడానికి చాలా తేడా ఉంటుంది. కెమెరా ముందు ఎలా ఉండాలనేది దర్శకుడు ముందే చెప్పారు. కథ, పాత్ర, ఆ మాటలు అర్థం చేసుకుని నటించాలి. కెమెరా కేవలం మన మొహాలను మాత్రం క్యాప్షర్ చేయదు. మనలోని భావాలను కూడా పట్టేస్తుంది. కెమెరాకు ఆ శక్తి ఉందని అన్నారు.

ఈ సినిమాకు, నేను చేసిన షార్ట్ ఫిల్మ్‌కు సంబంధం లేదని ఇందులో నాట్యం అనే ఊరిలో సితార అనే పాత్రలో కనిపిస్తానని అన్నారు. సినిమా పరిశ్రమ గురించి బయట ఏవేవో అంటారని, ఇక్కడ పాలిటిక్స్, నెగెటివిటీ ఎక్కువ ఉంటుందని కానీ ఇక్కడ చాలా మంచి వారున్నారని అన్నారు. మంచి కంటెంట్‌తో వస్తే ఆదరిస్తారు. పెద్ద స్టార్స్‌ కూడా చిన్నవాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. అలా చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మాకు టైం కేటాయించడం వల్ల మా జీవితమే మారిపోయిందని అన్నారు.

మా గురువు వెంపటి చినసత్యం గారు చేసినట్టు చేస్తే చాలు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఆ తరంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నాట్యాన్ని చేశారు. ఇప్పుడు ఈ తరానికి తగ్గట్టుగా కూచిపూడి నాట్యంలో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు