“నాట్యం” ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్‌చరణ్‌..!

Published on Oct 17, 2021 2:15 am IST


ప్రముఖ నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. నృత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించారు. నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రామ్‌చరణ్‌ విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఆద్యంతం అలరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తుంటే అర్ధమవుతుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. కాగా ఈ సినిమాలో కమల్‌కామరాజ్‌, రోహిత్‌ బెహల్‌, ఆదిత్య మేనన్‌ తదితరులు నటించారు. ఈ సినిమాకు శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More