స్టార్ హీరోలనే నమ్ముకున్న యంగ్ హీరో!
Published on Oct 11, 2016 4:35 pm IST

Navdeep
‘జై’, ‘గౌతమ్ ఎస్.ఎస్.సీ’, ‘చందమామ’ సినిమాలతో హీరోగా మెప్పించిన నవదీప్, ఆ తర్వాత ‘ఆర్య 2’, ‘బాద్‌షా’ లాంటి సినిమాల్లో సెకండ్ లీడ్ తరహా పాత్రలు చేసి కూడా బాగానే మెప్పించారు. అయితే బాద్షా తర్వాత నవదీప్ ఇటు హీరోగా కానీ, సెకండ్ లీడ్‌గా కాని ఏమాత్రం ఆకట్టుకోలేక కెరీర్‌ను గందరగోళలో పడేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికైనా కెరీర్‌ను గాడిలో పెట్టుకోవాలన్న ఉద్దేశంతో జాగ్రత్తగా పలు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలను సొంతం చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’లో నవదీప్ ఓ కీలక పాత్రలో నటించారు.

ఇక తాజాగా ‘బాహుబలి’ స్టార్ రానా నటిస్తోన్న ఓ కొత్త సినిమాలోనూ మంచి అవకాశం సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా చలామణి అయిన తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నవదీప్ రోల్ కీలకం కానుందట. దీంతో హీరోగా పెద్దగా మెప్పించలేకపోతున్న ఈ పరిస్థితుల్లో, స్టార్ హీరోలు నటిస్తోన్న సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించడం ద్వారా అయినా మెప్పించాలని నవదీప్ పెద్ద హీరోల సినిమాలను జాగ్రత్తగా గమనిస్తున్నారని సమాచారం.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 

వీక్షకులు మెచ్చిన వార్తలు