ఓటిటి పార్ట్న‌ర్ ను లాక్ చేసిన ‘ల‌వ్ మౌళి’

ఓటిటి పార్ట్న‌ర్ ను లాక్ చేసిన ‘ల‌వ్ మౌళి’

Published on Jun 19, 2024 2:30 PM IST

హీరో న‌వ‌దీప్ న‌టించిన రీసెంట్ మూవీ ‘ల‌వ్ మౌళి’ రిలీజ్ కు ముందు ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్లు మంచి బ‌జ్ ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఎలాంటి కంటెంట్ తో వ‌స్తుందా అని అంద‌రూ ఆస‌క్తిగా చూశారు.

ఇక‌ ఈ సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వ‌ద్ద మిక్సిడ్ టాక్ ను సొంతం చేసుకుంది. న‌వ‌దీప్ న‌ట‌న‌కు మంచి మ‌ర్కులే ప‌డ్డాయి. కానీ, అనుకున్న‌స్థాయిలో ఈ మూవీ విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటిటి పార్ట్న‌ర్ ను లాక్ చేసుకుంది.

ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో ‘ల‌వ్ మౌళి’ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ ప్రక‌టించారు. ఇక త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు ఆహా వెల్ల‌డించింది. పంకూరి గిద్వాని హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమాను అవ‌నీంద్ర డైరెక్ట్ చేశారు. గోవింద్ వ‌సంత ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు