బాలయ్య సినిమాలో ఆ హీరో కూడా.. నిజమేనా ?

బాలయ్య సినిమాలో ఆ హీరో కూడా.. నిజమేనా ?

Published on May 16, 2022 11:37 PM IST


సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, జులై ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. కాగా ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తాడని.. అది రవితేజనే అని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా నవీన్ పొలిశెట్టి పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందట. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సీరియస్ గా సాగుతూ.. ఇంటర్వెల్ కి సినిమా ఫుల్ కామెడీగా టర్న్ అవుతుందని తెలుస్తోంది. అంటే నవీన్ పొలిశెట్టి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అందుకే, అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు