కొత్త దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి..!

Published on Aug 20, 2021 2:40 am IST

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంలో హీరోగా నటించి మెప్పించిన నవీన్ పోలిశెట్టి “జాతి రత్నాలు” సినిమాతో క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్ కోసం నవీన్ పోలిశెట్టి కొన్నాళ్లుగా వైవిధ్య‌మైన క‌థ‌లు వింటున్నట్టు తెలుస్తుంది. జాతిరత్నాలు సినిమా రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో కీలకంగా పని చేసిన కళ్యాణ్ అనే కొత్త దర్శకుడు చెప్పిన లైన్ నవీన్ పోలిశెట్టికి బాగా న‌చ్చ‌డంతో అతనితో సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని సమాచారం. సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే యూవీ క్రియేషన్స్‌ నిర్మాణంలో అగ్రకథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందించే ఓ ప్రేమకథా చిత్రంలో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

సంబంధిత సమాచారం :