‘రాధేశ్యామ్‌’ ప్రీరిలీజ్ హోస్టింగ్‌కి ‘జాతిరత్నం’ ఎంత తీసుకున్నాడంటే?

Published on Dec 29, 2021 10:30 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతుంది. అయితే ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఘనంగా జరగగా, ఈ వేడుకకు ‘జాతిరత్నాలు’ సినిమా హీరోయిన్ నవీన్ పోలిశెట్టి హోస్టింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.

అయితే అసలు నవీన్ పోలిశెట్టి యాంకర్‌గా ఎందుకు మారాడు? అతడిని ఈ ఈవెంట్‌కి హోస్టింగ్ చేయమని ఎవరు సూచించారు? హోస్టింగ్‌కి గాను అతడు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు? అనే విషయాలపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. అయితే నవీన్‌ పోలిశెట్టి తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా, బాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. చిచోరేతో ఈ జాతిరత్నం బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అందుకే అతడిని ప్రీ రిలీజ్ వేడుకకు హోస్ట్‌గా చేయిస్తే బెటర్ అని నాగ్‌ అశ్విన్‌. ప్రభాస్‌కి చెప్పాడట. దీంతో నవీన్‌ పొలిశెట్టి హోస్టింగ్‌కి ప్రభాస్ కూడా ఒకే చెప్పేశాడట.

ఇక నవీన్‌ పోలిశెట్టి నటించిన ‘జాతిరత్నాలు’ మూవీ ట్రైలర్‌ని ప్రభాస్ విడుదల చేసి, సినిమా సక్సెస్‌కి తనవంతు సాయాన్ని అందించాడు. దీంతో ప్రభాస్‌పై ఉన్న కృతజ్ఞతా భావంతో నవీన్ పోలిశెట్టి ‘రాధేశ్యామ్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి ఎలాంటి రెమ్యునరేషన్‌ తీసుకోకుండా ప్రీ గా హోస్టింగ్‌ చేశాడట. ఏది ఏమైనా ఈ జాతిరత్నం తనదైన శైలిలో యాంకరింగ్ చేసి అలరించాడనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :