‘జాతి రత్నాలు 2’ పై మరో పుకారు వైరల్ ?

Published on Oct 3, 2022 2:00 pm IST

‘జాతి రత్నాలు’ డైరెక్టర్ అనుదీప్, నవీన్ పోలిశెట్టి తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నవీన్ కి అనుదీప్ ఓ కథ చెప్పాడని, నవీన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే, ఇది కొత్త కథా ?, లేక జాతి రత్నాలు 2 అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కామెడీ డ్రామాలో ఫుల్ ఫన్ ఉంటుందట.

మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. ‘జాతి రత్నాలు’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువైన నవీన్ పోలిశెట్టి – అనుదీప్ మళ్లీ కలిసి మరో సినిమా చేస్తే మంచి అంచనాలు ఉంటాయి. నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమా చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడట. ఏది ఏమైనా ‘జాతి రత్నాలు 2’ పై ఎప్పటి నుంచో రూమర్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :