నవీన్ పోలిశెట్టి తో స్వాతిముత్యం డైరెక్టర్ ?

Published on Mar 6, 2023 4:00 pm IST

స్వాతిముత్యం డైరెక్టర్ లక్ష్మణ్ కె కృష్ణ, హీరో నవీన్ పోలిశెట్టి తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే, నవీన్ పోలిశెట్టికి లక్ష్మణ్ కె కృష్ణ ఓ కథ చెప్పాడని, నవీన్ పోలిశెట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇది పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ డ్రామా అని, ఇద్దరి మాజీ లవర్స్ మధ్య ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. అయితే, ఈ ఎమోషనల్ డ్రామాలో మంచి ఫన్ ఉంటుందట.

మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కామెడీ ఆడియన్స్ ఫేవరేట్ హీరో నవీన్ పోలిశెట్టికి లక్ష్మణ్ కె కృష్ణ కామెడీ కలిస్తే ఇంట్రెస్ట్ గా ఉంటుంది. సితార సంస్థ ఈ సినిమా చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తోందట. మొత్తానికి నవీన్ పోలిశెట్టి ఇమేజ్ కోసం లక్ష్మణ్ కె కృష్ణ బలమైన కథ రాశాడట. ఏది ఏమైనా నవీన్ పోలిశెట్టి సినిమాల పై రోజుకొక రూమర్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :