స్టాండప్ కమెడియన్ గా నవీన్ పోలిశెట్టి ఫస్ట్ లుక్ !

స్టాండప్ కమెడియన్ గా నవీన్ పోలిశెట్టి ఫస్ట్ లుక్ !

Published on Dec 26, 2022 7:00 PM IST

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. సోమవారం హీరో నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ సిద్ధు పోలిశెట్టి క్యారెక్టర్ లో కనిపించనున్నారు.

కామెడీ టైమింగ్ లో మంచి పేరున్న నవీన్ స్టాండప్ కమెడియన్ గా మరింతగా నవ్వించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది తెరపైకి రానున్న ఈ మూవీపై ఫిల్మ్ లవర్స్ లో మంచి అంచనాలున్నాయి. కాగా ఈ సినిమాతో చాలా మెచ్యూర్డ్ లవ్ స్టోరీని చూపించబోతుట్టు సమాచారం. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటో చూడాలి. మొత్తానికి ‘జాతి రత్నం’ సినిమాతో నవీన్ పొలిశెట్టి స్టార్ అయిపోయాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు