“సైంధవ్” నుండి నవాజుద్దీన్ సిద్ధికి లుక్ పోస్టర్ రిలీజ్!

Published on May 19, 2023 10:00 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను రచన, దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం సైంధవ్. శ్రద్ద శ్రీనాథ్, రుహనీ శర్మ, ఆండ్రియా జెరేమియా లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై, ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ నవాజుద్దీన్ సిద్ధికి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

నేడు నవాజుద్దీన్ సిద్ధికి పుట్టిన రోజు కావడం తో మేకర్స్, నటుడు యొక్క లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. వికాస్ మాలిక్ గా ఈ చిత్రం లో నటిస్తున్నారు. నటుడు రఫ్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :