చలిలో కూడా చిత్రీకరణ జరుపుకుంటున్న “నాయక్”

రామ్ చరణ్ రాబోతున్న చిత్రం “నాయక్” చిత్ర చిత్రీకరణ హైదరాబాద్లో జరుపుకుంటుంది గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయిఇంత చలిలో కూడా “నాయక్” చిత్ర బృందం చిత్రీకరణ కొనసాగిస్తున్నారు. మరో ఐదు రోజులు పాటు సాగనున్న ఈ చిత్రీకరణలో రామ్ చరణ్ మరియు అమలా పాల్ పాల్గొంటున్నారు. మరో ప్రధాన పాత్రలో కాజల్ నటిస్తున్నారు వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. యూనివర్సల్ మీడియా బ్యానర్ మీద డి వి వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పూర్తి మాస్ ఎంటర్ టైనర్ కానుంది. జనవరి 9 2013న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యనున్నారు సంక్రాంతి రేస్ లు పాల్గొనబోయే మొదటి రామ్ చరణ్ చిత్రం ఇదే.

Exit mobile version