వైరల్ : సీఎం ని తమ పెళ్ళికి ఆహ్వానించిన నయన్, విగ్నేష్.!

Published on Jun 5, 2022 10:51 am IST

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార మరియు ప్రముఖ దర్శకుడు అయినటువంటి విగ్నేష్ శివన్ గత కొంత కాలం నుంచి ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీరి ప్రేమ ఎట్టకేలకు పెళ్లిగా మారనున్నట్టుగా గత కొన్ని వారాల కితం కన్ఫర్మ్ అయ్యింది. ఈ జూన్ 9 న తేదీని ఫిక్స్ చేసుకోగా ఇప్పుడు వీరి పెళ్ళికి గాని తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎం కే స్టాలిన్ ని కలిసి ఆహ్వానించడం వైరల్ గా మారింది.

అలాగే వారితో పాటుగా ఎం కె తనయుడు ప్రముఖ ఉదయనిధి స్టాలిన్ కూడా ఉండడంతో ఈ నలుగురి కలయిక ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే వీరి వివాహం ముందు తిరుపతిలో జరగొచ్చని టాక్ వచ్చింది కానీ ఇపుడు మహాబలిపురంలో జరుపుకోనున్నారట.

అందుకోసం తమిళనాడు సీఎం ని వారు ఆహ్వానించారు. ఇక ఇదిలా ఉండగా విగ్నేష్ దర్శకత్వంలో నయన్ తో పాటుగా సమంత కూడా మరో హీరోయిన్ గా “కన్మణి రాంబో కతిజ” అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అందులో విజయ్ సేతుపతి హీరోగా నటించాడు.

సంబంధిత సమాచారం :