ఇంట్రెస్టింగ్ గా నయన్ “కనెక్ట్” ట్రైలర్.!

Published on Dec 9, 2022 8:00 am IST

తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గానే కాకుండా ఇప్పుడు పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు అయితే నయన్ నటించిన లేటెస్ట్ చిత్రం “కనెక్ట్”. ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ చిత్రానికి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వచించాడు. మరి ఇప్పుడు అయితే ఈ చిత్రం తెలుగు సహా తమిళ్ ట్రైలర్ బయటకి రాగా ఇది మంచి ఆసక్తిగా ఉందని చెప్పాలి.

మొదట అంతా నయన్ తన ఫ్యామిలీ సీన్స్ తో డీసెంట్ గా ఉండగా నెక్స్ట్ నేషనల్ లాక్ డౌన్ కి ముందు అన్నట్టుగా ఓ రాత్రి వీడియో కాల్ వచ్చినట్టుగా ఓ సౌండ్ తర్వాత వీడియో కాల్ లో నయన్ తన స్నేహితుల మాటలు ఆసక్తిగా అనిపిస్తున్నాయి. అలాగే ఇందులో ఓ డెవిల్ గేమ్ ని కూడా చూపిస్తున్నారు. ఇలా ఓ ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ గా అయితే ఈ ట్రైలర్ కనిపిస్తుంది.

మరి నటీనటులు నయన్ సహా సీనియర్ నటుడు సత్యరాజ్ లు తమ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ సాలిడ్ పాత్ర చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. ఇంకా ఈ చిత్రం అయితే ఎలాంటి బ్రేక్ లేకుండా డిజైన్ చేసినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. మరి ఈ డిసెంబర్ 22న రాబోయే ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :