నయనతార ‘కనెక్ట్’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

నయనతార ‘కనెక్ట్’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

Published on Dec 7, 2022 3:15 AM IST


విగ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ సస్పెన్స్ హర్రర్ జానర్ మూవీ కనెక్ట్. ఆకట్టుకునే కథ, కథనాలతో యువ దర్శకడు అశ్విన్ శరవణన్ తీసిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఇప్పటికే రిలీజ్ అయి ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

ఇక ఈ మూవీని తెలుగులో ప్రముఖ సంస్థ యువి క్రియేషన్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ మూవీ యొక్క అఫీషియల్ తెలుగు థియేట్రికల్ ట్రైలర్ ని డిసెంబర్ 9న సరిగ్గా అర్ధరాత్రి 12గం. లకు రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ ప్రకటించారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు చేసిన కనెక్ట్ మూవీ డిసెంబర్ 22న భారీ స్థాయిలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు