నాగార్జున ప్రస్తుతం సీక్వెల్స్ ఫై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా ప్రస్తుతం అయన ‘మన్మథుడు 2’ లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు నాగ్ , ‘సోగ్గాడే చిన్నినాయనా’ కు సీక్వెల్ గా ‘బంగార్రాజు’ అనే చిత్రాన్ని చేయనున్నాడని తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈచిత్రానికి హీరోయిన్ ను వెతికే పనిలో వున్నాడు. అందుకోసం ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార ను కలిసి స్టోరీ వినిపించాడట. ఆమె కూడా సినిమా చేయడానికి సుముఖంగా ఉందని టాక్. త్వరలోనే హీరోయిన్ విషయంలో స్పష్టత రానుంది. ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా నటించనుండగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుంది.
ఇక నాగ్ , నయన్ కలిసి ఇంతకుముందు బాస్ , గ్రీకు వీరుడు చిత్రాల్లో నటించారు. అయితే ఈ రెండు కూడా బాక్సాఫీస్ వద్ద వర్క్ అవుట్ అవ్వలేదు.
