త్వరలో నయనతార షూటింగ్ లో పాల్గోనబోతోంది!

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ఈ మద్య కాలంలో నయనతార ఈ సినిమా నుండి తప్పుకుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఆ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తోంది.

ఫిబ్రవరి నుండి నయనతార ఈ సినిమా షూటింగ్ లో పాల్గోనబోతోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి నటులు నటిస్తున్నారు. ప్రతిస్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరించే విధంగా తీస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు పనిచేయ్యబోతున్న సంగీత దర్శకుడు ఎవరనేది అధికారికంగా ప్రకటించబోతున్నారు సినిమా యూనిట్.