నయన్ రెమ్యూనరేషన్ పెంచేసిందట !కథాబలం వున్నా చిత్రాలలో నటిస్తూ తెలుగు , తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతుంది సీనియర్ హీరోయిన్ నయనతార. ఇక ఈ ఏడాది ఆగస్టు నెల ఆమె కు బాగా కలిసొచ్చింది. ఆమె నటించిన రెండు చిత్రాలు ఈనెలలోనే విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. దాంట్లో మొదటి సినిమా విడుదలైన ‘కొలమావు కోకిల’ ఆగస్టు 17న విడుదలై ఇప్పటివరకు 25కోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది. నయన్ ప్రధాన పాత్రలో నటించిన ఈచిత్రం క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఇక రెండవ చిత్రం ‘ఇమ్మైక నొడిగళ్’ ఆగస్టు 30న విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

ఇలా తను నటించిన రెండు చిత్రాలు బ్లాక్ బ్లాస్టర్ విజయాలను సాధించడంతో నయన్ తన రెమ్యూనరేషన్ ను పెంచేసిందట. ప్రస్తుతం సినిమాకు కోటి నుండి రెండు కోట్ల దాకా తీసుకుంటున్న ఈ హీరోయిన్ ఇప్పుడు దాన్ని మూడు కోట్లకు పెంచిందట. ఇక ప్రస్తుతం నయనతార తెలుగు, తమిళ భాషల్లో ‘సైరా , విశ్వాసం’ చిత్రాల్లో నటిస్తుంది. వీటితో పాటు ఆమె కమల్ హాసన్ ‘భారతీయుడు 2’లో కూడా నటించే అవకాశాలు వున్నాయి.