రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న లేడీ సూపర్ స్టార్ సినిమా !

2nd, March 2017 - 04:03:37 PM


తమిళ స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార నటిస్తున్న కొత్త చిత్రం ‘డోర’. గ్లామర్ సినిమాలు తగ్గించి పూర్తిగా ప్రయోగాత్మక సినిమాలు పై దృష్టి పెట్టిన నయనతార చేతిలో చాలా వరకు ఇలాంటి ప్రాజెక్ట్సే ఉన్నాయి. 2015 లో ఆమె నటించిన ‘మాయ’చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాలపై మంచి అంచనాలున్నాయి. ఇకపోతే దాస్ రామస్వామి డైరెక్షన్లో గతేడాది మొదలైన ఈ చిత్రం చాన్నాళ్లు షూటింగ్ జరుపుకుని ఎట్టకేలకు మార్చి 31న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

గతంలో ‘మాయ’ చిత్రం తెలుగులో ‘మాయావనం’ పేరుతో విడుదలై మంచి సక్సెస్ తెచ్చుకోవడంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసే అవకాశాలున్నాయి. నయనతార క్రేజ్, భిన్నమైన సినిమాలకు పెరిగిన ఆదరణ, థ్రిల్లింగా ఉండే ఈ చిత్రం యొక్క కథాకథనాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం మంచి విజయం సాధించే అవకాశాలున్నాయని తమిళ సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ హర్రర్ థ్రిల్లర్ చిత్రం కాకుండా నయనతార ప్రస్తుతం ‘వేలైక్కారన్, ఇమైక్క నొడిగళ్, అరామ్, కొలైయుతిర్ కాలం’ లాంటి చిత్రాల్లో నటిస్తోంది.