విడుదల తేదీని ఫైనల్ చేసుకున్న నయనతార హర్రర్ థ్రిల్లర్ !


తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ కావాలంటే స్టార్ హీరోలతోనే సినిమాలు చేయనక్కర్లేదని సోలోగా కూడా లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు తెచ్చుకోవచ్చని నిరూపించిన హీరోయిన్ నయనతార. గ్లామర్ సినిమాలు తగ్గించి పూర్తిగా ప్రయోగాత్మక సినిమాలు పై దృష్టి పెట్టిన నయనతార చేతిలో చాలా వరకు ఇలాంటి ప్రాజెక్ట్సే ఉన్నాయి. అందులో ఒకటి ‘డోరా’.

టీజర్, ట్రైలర్లతో అందరిలోనూ ఆసక్తి రేపిన ఈ చిత్రం ఈ మధ్యే షూటింగ్ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని రిలీజుకు సిద్ధంగా ఉంది. మార్చ్ 31న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. హర్రర్ థ్రిల్లర్ గ తెరకెక్కిన ఈ చిత్రాన్ని దాస్ రామస్వామి డైరెక్ట్ చేశారు. ఈ చిత్రమే కాకుండా నయనతార ప్రస్తుతం ‘వేలైక్కారన్, ఇమైక్క నొడిగళ్, అరామ్, కొలైయుతిర్ కాలం’ లాంటి ప్రాజెక్టుల్లో నటిస్తోంది.