లీలా కోసం డబ్బింగ్ చెప్పిన నజ్రియా…వైరల్ అవుతోన్న వీడియో

Published on May 24, 2022 8:10 pm IST

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం లో నాని సరసన హీరోయిన్ గా మలయాళ బ్యూటీ నజ్రియా నటిస్తుంది. ఈ చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ భామ. ఈ చిత్రం లో లీలా అనే పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

లీలా కోసం నజ్రియా తెలుగు డబ్బింగ్ చెప్పడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో లో నజ్రియా ఎక్స్ప్రెషన్స్ ఫ్యాన్స్ ను, ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని జూన్ 10, 2022 న భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :