ఆ తెలుగు హీరోలతో నటించాలని ఉందన్న నజ్రియా..!

Published on Jun 9, 2022 2:30 am IST

నేచురల్ స్టార్ నాని ఇప్పటికీ ఎంతోమంది టాలెంటెడ్ హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి మరో హీరోయిన్ నజ్రియా కూడా చేరింది. నాని, నజ్రియా కాంబినేషన్‌లో వివేక్ ఆత్రేయా తెరకెక్కించిన ‘అంటే సుందరానికీ’ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ నజ్రియా కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.

తెలుగులో ఎన్‌టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్‌లాంటి హీరోలతో కూడా తనకు నటించాలని ఉందని బయటపెట్టింది నజ్రియా. అంతే కాకుండా తమిళంలో కూడా అజిత్ లాంటి స్టార్ సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని నజ్రియా చెప్పుకొచ్చింది. చూడాలి మరీ అంటే సుందరానికీ సక్సెస్ నజ్రియాకు ఎన్ని ఆఫర్లను తెచ్చిపెడుతుందనేది.

సంబంధిత సమాచారం :