సిసలైన మాస్ స్వాగ్ తో నందమూరి నటసింహం #NBK107 ఫస్ట్ హంట్

Published on Jun 9, 2022 6:19 pm IST


టాలీవుడ్ స్టార్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రం సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. అదే జోష్ ను కొనసాగిస్తూ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. క్రాక్ తో సిసలైన మాస్ పవర్ చూపించిన గోపీచంద్ మలినేని బాలయ్య బాబు ను ఓ రేంజ్ లో చూపించనున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

జూన్ 10 వ తేదీన బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ ఫస్ట్ హాంట్ పేరిట విడుదల చేయడం జరిగింది. టీజర్ మామూలుగా లేదు. నందమూరి బాలకృష్ణ అభిమానులు పండుగ చేసుకొనే విధంగా ఫుల్ మాస్ పవర్ తో టీజర్ నిండి పోయింది. నందమూరి బాలకృష్ణ మాస్ ప్రెజెన్స్, డైలాగ్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ అద్దిరిపోయాయి. ఈ టీజర్ లో భయం నా బయోడేటా లోనే లేదు బోశాడికే అంటూ చెప్పిన డైలాగ్ మరింత పవర్ ఫుల్ గా ఉంది. టీజర్ లో మాస్ బాలకృష్ణ సిసలైన స్వాగ్ తో విశేషం గా ఆకట్టుకుంటున్నారు.

ఈ చిత్రం లో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :