బాలయ్య కొత్త సినిమా నుంచి కొత్త అప్ డేట్ !

Published on Apr 11, 2022 5:37 pm IST


నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి ఒక అప్ డేట్ ను రివీల్ చేశారు మేకర్స్. నిన్నటి వరకు, సిరిసిల్లలో బాలకృష్ణ పై హై యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు. అయితే, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ రోజు నుంచి కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది టీమ్. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈ సినిమా శివరాజ్ కుమార్ ‘మఫ్టీ’ అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అని తెలుస్తోంది. కాగా రామ్ – లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇక ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు. మరి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న ఈ సినిమాతో.. ఇక గోపిచంద్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

సంబంధిత సమాచారం :