లేటెస్ట్ : NBK 108 టైటిల్ రివీల్ టైం ఫిక్స్

Published on Jun 7, 2023 8:00 pm IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం NBK 108 వర్కింగ్ టైటిల్ తో ఒక భారీ ప్రతిష్టాత్మక మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ యాక్షన్ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ నటి శ్రీలీల కీలక పాత్ర చేస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ హైప్ కలిగిన ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై దీనిని గ్రాండ్ లెవెల్లో హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. విషయం ఏమిటంటే, జూన్ 8 న తమ మూవీ యొక్క టైటిల్ ని అనౌన్స్ చేయనున్నాము అంటూ ఇప్పటికే ప్రకటించారు మూవీ మేకర్స్. కాగా ఈ మూవీ టైటిల్ ని జూన్ 8 ఉదయం 9 గం. 10 ని. లకు అనౌన్స్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి రానున్న దసరా పండుగ కానుకగా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :