లేటెస్ట్ : ‘అన్ స్టాపబుల్ – 2’ ఎపిసోడ్ – 3 ప్రోమో రిలీజ్ టైం ఫిక్స్

లేటెస్ట్ : ‘అన్ స్టాపబుల్ – 2’ ఎపిసోడ్ – 3 ప్రోమో రిలీజ్ టైం ఫిక్స్

Published on Nov 1, 2022 1:43 AM IST


నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రస్తుతం ఆహా ఓటిటి మాధ్యమంలో ప్రసారం అవుతున్న క్రేజీ షో అన్ స్టాపబుల్ సీజన్ 2. దెబ్బకు థింకింగ్ మారిపోవాల అనే కాన్సెప్ట్ తో మంచి ఎంటర్టైనింగ్ గా కొనసాగుతున్న ఈ షో ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ అలానే సెకండ్ ఎపిసోడ్ కి సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ విచ్చేసి తమ లైఫ్ లోని పలు సరదా సంగతులని పంచుకున్నారు.

ఇక అందరిలో మూడవ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. కాగా మూడవ ఎపిసోడ్ కి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన యువ నటులు అడివిశేష్, శర్వానంద్ విచ్చేసారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ మూడవ ఎపిసోడ్ యొక్క ప్రోమో ని రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనుండగా ఫుల్ ఎపిసోడ్ ని నవంబర్ 4 నుండి ఆడియన్స్ కి అందుబాటులో తీసుకురానున్నట్లు కొద్దిసేపటి క్రితం ఆహా వారు అఫీషియల్ గా ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు