‘NBK అన్ స్టాపబుల్ సీజన్ – 2’ ప్రారంభం అప్పుడేనట … ?

Published on Jul 14, 2022 12:30 am IST

ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో ఇటీవల ప్రసారమైన క్రేజీ ఎంటర్టైన్మెంట్ షో అన్ స్టాపబుల్. నందమూరి బాలకృష్ణ తొలిసారిగా ఈ షోలో హోస్ట్ గా వ్యవహరించారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ లైఫ్ గురించి షేర్ చేసుకునే పలు ఆసక్తికర విషయాల సమాహారంగా కొనసాగిన అన్ స్టాపబుల్ షో సీజన్ 1 ఇటీవల ముగిసిన దగ్గరి నుండి సీజన్ 2 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆడియన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే అన్ స్టాపబుల్ సీజన్ 2 ని ఆగష్టు నెల నుండి ప్రారంభించేందుకు ఆహా ఒటిటి యజమాన్యం వారు ఇప్పటికే సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. సీజన్ 1 ని మించేలా మరింత ఎంటర్టైన్మెంట్, ఫన్ తో సీజన్ 2 కొనసాగనుందని, అలానే ఈ సీజన్ లో తొలి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రానున్నారని తెలుస్తోంది. కాగా త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అఫీషయల్ గా అనౌన్స్ కానున్నాయి.

సంబంధిత సమాచారం :