భారీ ధరకు అమ్ముడైన బాలయ్య సినిమా శాటిలైట్ రైట్స్ ?


100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నందమూరి బాలకృష్ణ 101వ సినిమాని ఎవరితో చేస్తారు, ఆ సినిమా ఎలా ఉండబోతోంది అనే ఆలోచనల్లో అభిమానులు ఉండగానే ఆయన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సినిమా అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురికి చేశారు. అస్సలు ఊహకు కూడా అందని ఈ కాంబినేషన్ తో బాలయ్య అభిమానులేగాక, సినీ ప్రేక్షకులు కూడా విభిన్నమైన స్టైల్స్ కలిగిన వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఉన్నారు.

దీంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ అంచనాల మూలంగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తారా స్థాయిలో జరుగుతున్నట్టు సమాచారం. తాజా సినీ వర్గాల్లో వినబడుతున్న మాటల ప్రకారం ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ ఛానెల్ ఒకటి రూ. 9 కోట్ల భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందట. అయితే ఈ వార్తపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి వెలువడలేదు. ఇకపోతే ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేసేందుకు పక్క ప్రణాళికను రూపొందించారు పూరి.