త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న బాలకృష్ణ 102 వ సినిమా!
Published on Jul 22, 2017 4:28 pm IST


బాలకృష్ణ ప్రస్తుతం పూరీ జగన్నాద్ కాంబినేషన్ లో 101 వ చిత్రంగా పైసా వసూల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ మేగ్జిమమ్ పూర్తయినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఎప్పటి నుంచి వినిపిస్తున్న ఎన్టీఆర్ 102వ చిత్రం. సీనియర్ దర్శకుడు కె. ఎస్. రవికుమార్ కాంబినేషన్ లో ఉంటుందని. సి. కళ్యాన్ నిర్మించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పైసా వసూ పూర్తి చేసుకోవడంతో వీలైనంత వేగంగా ఈ సినిమాని పట్టాలు ఎక్కించాలని దర్శక, నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార ఫైనల్ అయిన విషయం అందరికి తెలిసిందే. మరో సింహా తర్వాత నాయన- బాలయ్య కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమా. క్రేజ్ డైరెక్టర్ కె.ఎస్ రవికుమార్ ఎ స్థాయికి తీసుకుపోతాడో చూడాలి.

 
Like us on Facebook