యాక్షన్ మోడ్ లోకి వెళ్లనున్న బాలయ్య !

21st, August 2017 - 11:22:44 AM


నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రాన్ని కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభోత్సవం రోజు నుండే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈరోజు నుండి జరగబోయే షూటింగ్లో బాలకృష్ణపై హెవీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాల్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా పాల్గొననున్నారు.

ఇకపోతే స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈరోజు నుండే షూటింగ్లో పాల్గొననుంది. గతంలో ‘సింహా, శ్రీరామ రాజ్యం’ వంటి సినిమాల్లో కలిసి నటించిన బాలకృష్ణ, నయనతారలకు ఇది మూడవ చిత్రం కావడం విశేషం. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా ఏ.ఎం రత్నం కథను అందించారు.