పవర్ ఫుల్ గా #NBK107 ఫస్ట్ లుక్‌

Published on Feb 21, 2022 4:44 pm IST

బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో అఖండ ఒకటి. తన మాస్ చిత్రాలతో ప్రేక్షకులని, అభిమానులను అలరిస్తున్న బాలయ్య, కొత్త ఎనర్జీతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ని తాజాగా మేకర్స్ విడుదల చేయడం జరిగింది. బాలయ్య లుక్స్ చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయి. బాలయ్య బ్లాక్ సూట్‌లో, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో షేడ్‌తో డాపర్‌గా కనిపిస్తున్నాడు.

బాలయ్య ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఇదంతా జరిగింది. ఎటువంటి ఎంపిక లేకుండా, మేకర్స్ ఫైనల్ లుక్‌ను విడుదల చేశారు. ఈ కొత్త లుక్ అభిమానులను అమితంగా ఆనందపరిచింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :