లేటెస్ట్: దసరా పండుగకు రిలీజ్ కాబోతున్న “NBK108”

లేటెస్ట్: దసరా పండుగకు రిలీజ్ కాబోతున్న “NBK108”

Published on Mar 31, 2023 1:21 PM IST

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహ నందమూరి బాలకృష్ణ మరియు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ మాస్ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ NBK108. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు, ఈ చిత్రం రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

దసరాకి NBK108 ని విడుదల చేస్తామని ప్రకటించారు. విజయదశమికి ఆయుధ పూజ అని ప్రకటించారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి బాలయ్య మాస్ పోస్టర్ ను చేశారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. C రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని చూసుకుంటున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు