అఫీషియల్ : “బాలయ్య 108” పై కన్ఫర్మ్ అయ్యిన అప్డేట్.!

అఫీషియల్ : “బాలయ్య 108” పై కన్ఫర్మ్ అయ్యిన అప్డేట్.!

Published on Dec 7, 2022 2:01 PM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడితో అయితే అనౌన్స్ చేసిన మరో మాస్ చిత్రం కోసం కూడా తెలిసిందే. మరి బాలయ్య కెరీర్ లో ఇది 108వ సినిమా కాగా ఈ చిత్రాన్ని ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లా అయితే దర్శకుడు అనీల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా నిన్నటి నుంచి అయితే ఈ సినిమాపై పలు రూమర్స్ వినిపిస్తూ వస్తుండగా మేకర్స్ ఇప్పుడు వాటిని నిజం చేసారు.

ఈ డిసెంబర్ 8న అంటే రేపే ఈ సినిమా ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా రేపు ఉదయం 9 గంటల 36 నిమిషాలకి అయితే చిత్రం ముహూర్తంతో మొదలు కానున్నట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ సినిమాస్ వారు కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ కార్యక్రమం అయితే రేపు హైదరాబాద్ లో జరగనుండగా అనేకమంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు