గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాన్ని NBK111 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి మాస్ ఫీస్ట్ ఇవ్వనుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఇదిలా ఉండగా, ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు బాలయ్య అండ్ టీమ్ రెడీ అయ్యారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ రానుందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. NBK111 చిత్రానికి సంబంధించి టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను ఆ రోజున ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేరోజు రెండు ట్రీట్స్ వస్తుండటంతో బాలయ్య ఫ్యాన్స్ ఆ రోజు కోసం ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాను డిసెంబర్ 24, 2026 న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని వారు భావిస్తున్నారట. అదే సమయంలో అక్కినేని నాగార్జున మైల్స్టోన్ చిత్రం కింగ్ 100 కూడా రిలీజ్‌కు వస్తుండటంతో బాక్సాఫీస్ దగ్గర బిగ్ క్లాష్ ఖాయంగా కనిపిస్తుంది. మరి సెప్టెంబర్ 6న NBK111 ఇవ్వబోయే ఆ అప్డేట్ ఏమిటో చూడాలి.
